కిడ్నీ ఇన్ఫెక్షన్తో భాధపడుతున్న.. ఆర్ఎక్స్100 హీరోయిన్

కిడ్నీ ఇన్ఫెక్షన్తో భాధపడుతున్న.. ఆర్ఎక్స్100 హీరోయిన్

ఆర్ఎక్స్100(RX100) మూవీ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaraam). హారర్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో..పాయల్ రాజ్ పుత్(Payal Rajput) ప్రధాన పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ (అక్టోబర్ 21న) చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 

ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ పాయల్ రాజ్ ఫుత్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ మంగళవారం సినిమా తనకెంతో స్పెషల్ ఫిలిం అని చెప్పారు. అలాగే డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా స్టోరీ చెప్పేందుకు వచ్చేసరికి తీవ్ర కిడ్నీ ఇన్ఫెక్షన్ తో భాధపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఖచ్చితంగా కిడ్నీసర్జరీ చేయాల్సిందేనని డాక్టర్స్ చెప్పిన..ఈ కథపై ఉన్న నమ్మకంతో..సినిమా కంప్లీట్ అయ్యే వరకు సర్జరీ వద్దనుకున్నట్లు వెల్లడించారు. ఎంతో కష్టపడి పనిచేసినట్లు.. ఈ సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. 

మంగళవారం ట్రైలర్ విషయానికి వస్తే.. 

ట్రైలర్‌లో సినిమా స్టోరీ పెద్దగా రివీల్ చేయకుండా కొన్ని సీన్స్‌ను హైలైట్ చేస్తూ డైరెక్టర్ చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ మొత్తం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నింపేశాడు దర్శకుడు అజయ్ భూపతి. డైలాగ్స్ ఎక్కువ లేకుండా కేవలం విజువల్స్ తోనే ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేశారు. అలా అనుక్షణం భయపడుతూ బతికే ఒక ఊరి ప్రజలు..మంగళవారం వస్తే చాలు ఆ ఊర్లో ఒక శవం లేస్తుందనే భయాన్ని కలిగించాడు. అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు. అలాగే హత్య చేసిన ప్రతిసారి..గోడపైన ఏదో రాసి పెట్టి ఉంచడం..ఇలా ముసుగు వేసుకుని ఊరి ప్రజలను భయపెడుతున్న మనిషి ఎవరు అనే ఎన్నో ప్రశ్నలతో ట్రైలర్‌ కట్ చేసిన తీరు ఆడియన్స్ ను థ్రిల్ కి గురిచేస్తుంది.