మహిళలతో కలసి కోలాటం ఆడిన మంత్రి

మహిళలతో కలసి కోలాటం ఆడిన మంత్రి
  • ఖమ్మం నియోజకవర్గంలో సంబరంగా రైతుబంధు ఉత్సవాలు

ఖమ్మం: రైతు బంధు ఉత్సవాలు ఖమ్మం నియోజకవర్గంలోని చిమ్మపూడి గ్రామంలో  సంబరంగా జరిగాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గ్రామ శివారు నుండి ఎడ్ల బండిపై ఊరేగుతూ రైతులను, గ్రామస్తులను పలుకరిస్తూ ముందుకు సాగారు. అనంతరం మహిళలతో కలసి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా రైతులు  గ్రామంలో ట్రాక్టర్లతో ర్యాలీగా రైతువేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటం ఆడుతూ వీధుల గుండా జై కేసీఆర్.. జై రైతుబంధు అంటూ నినాదాలు చేశారు. అనంతరం రైతువేదిక వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్  చిత్రపటానికి క్షేరాభిషేకం నిర్వహిచారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. ఏ రాష్ట్రంలో లేనంత పంటను రైతులు పండిస్తున్నారని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్న సందర్భంగా ప్రధాని మోడీ రైతులకు క్షమాపణ చెప్పారని అన్నారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ధనిక రాష్ట్రంలో 9వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చూస్తుంటే కంట్లో నీళ్లొస్తున్నాయి