పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

 పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ఖమ్మం రూరల్, వెలుగు: వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిడకంటి చిన వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు రెవెన్యూలో నర్సింహాపురంలో నీట మునిగిన పత్తి చేలను ఆయన రైతులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రూరల్​మండలంలో వర్షాల కారణంగా నల్లరేగడి నేలలు ఊట పెట్టి నీరు నిలిచాయన్నారు. రైతులు సాగు చేసిన పెసర, మొక్కజొన్న, పత్తి , మిరప పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. 

పంటల బీమా లేకపోవడంతో ఒక్కో ఎకరానికి రూ.50 వేలు రైతులు నష్టపోయారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, రైతు సంఘం  మండల ప్రధాన కార్యదర్శి ఏలూరు భాస్కరరావు, నాయకులు బానోతు రాంకోటి, పాల్తియా శ్రీను, సిద్ధంశెట్టి ధనమూర్తి తదితరులు పాల్గొన్నారు.