బిగ్ బ్రేకింగ్: భారత్‎పై పాక్ మిస్సైల్, డ్రోన్ ఎటాక్.. 8 క్షిపణులను కూల్చివేసిన ఆర్మీ

బిగ్ బ్రేకింగ్: భారత్‎పై పాక్ మిస్సైల్, డ్రోన్ ఎటాక్.. 8 క్షిపణులను కూల్చివేసిన ఆర్మీ

శ్రీనగర్: భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురువారం (మే 8) రాత్రి జమ్ము కాశ్మీర్‎లోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఆకస్మిక దాడులకు పాల్పడింది. జమ్మూ ఎయిర్‌స్ట్రిప్, సత్వారీ కంటోన్మెంట్‌ సహా పలు ప్రాంతాల్లో రాకెట్లు, డ్రోన్లతో పాక్ ఎటాక్ చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ విమానాశ్రయం చుట్టూ ఎయిర్ సైరన్‌లు మోగుతున్నాయి. జమ్ముతో పాటు అఖ్నూర్, కుప్వారా, కిష్టావర్ ప్రాంతాల్లో కూడా వార్ సైరన్స్ మోగాయి. పాక్ దాడుల తర్వాత ఆ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్ము నగరం మొత్తం బ్లాక్ ఔట్ ప్రకటించారు. 

ALSO READ | సైనిక స్థావరాలే లక్ష్యం.. 15 ప్రాంతాలను టార్గెట్ చేసిన పాక్.. డ్రోన్లు, క్షిపణులను తిప్పికొట్టిన భారత్

జమ్మూ నగరంలో మొబైల్ సేవలు కూడా పనిచేయడం లేదు. పాక్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భారత భద్రతా దళాలు మెరుపు వేగంతో అలర్ట్ అయ్యాయి. జమ్మూ ప్రజలు అంతా ఇళ్లలోనే ఉండాలని.. ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రయోగించిన ఎనిమిది క్షిపణులను భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పాక్‎కు ధీటుగా భారత దళాలు కూడా ప్రతి దాడుల చేస్తున్నాయి. పలుచోట్ల పాక్‌ డ్రోన్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్‎లో యుద్ధ వాతావరణం నెలకొంది.