పది రూపాయలకే కార్పొరేట్ వైద్యం

పది రూపాయలకే కార్పొరేట్ వైద్యం

నాంపల్లి, వెలుగు: కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు చేరువ చేసేందుకు ఎస్ కేర్ హాస్పిటల్ ముందుకొచ్చింది. నాంపల్లి పరిధి విజయనగర్ కాలనీలో ఎస్ కేర్ హాస్పిటల్​ను చైర్మన్ స్రవంతి శ్రీధర్, హాస్పిటల్ చీఫ్ డాక్టర్ శ్రీధర్​తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్, చీఫ్ మాట్లాడుతూ... ఎస్ కేర్ ఆస్పత్రిలో పది రూపాయలకే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. 

సేవా దృక్పథంతో అందరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ సేవలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తమ హాస్పిటల్​లో ఉస్మానియా హాస్పిటల్​కు చెందిన సీనియర్ డాక్టర్లు వైద్యం అందిస్తారన్నారు. ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలో  ఈ సేవలను అందించడం ఆనందంగా ఉందని వివరించారు. తమ హాస్పిటల్ లో మెడిసిన్స్, టెస్టులపై డిస్కౌంట్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎం. వేణుగోపాల్ రెడ్డి, బి. వెంకటేశ్వరర రావు పాల్గొన్నారు.