
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలుగా.. డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'శాకిని డాకిని'. సెప్టెంబర్ 16న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి టీజర్ వదిలారు మేకర్స్. టీజర్ విషయానికొస్తే.. ఇందులో రెజీనా, నివేదాలు పోలీస్ అకాడమీలో ట్రైనీలుగా కనిపిస్తారు. నివేదా ఫుడ్ లవర్ కాగా, రెజీనాకు ఓసీడీ సమస్య ఉంటుంది. శిక్షణా శిబిరంలో వారిద్దరు తరచూ గొడలుపడుతుంటారు. ఇంతలో ఒక నేరస్థుడు ఒక అమ్మాయిని తలపై కొట్టినట్లుగా చూపిస్తారు. దీంతో మెయిన్ స్టోరీ రివీల్ అవుతుంది.
ఇక అక్కడి నుండి ఆ ఇద్దరు అమ్మాయిలు రౌడీలను ఎలా ఎదుర్కొన్నారనేది టీజర్ లో చూడవచ్చు. టీజర్‌ను బట్టి చూస్తే, సినిమాలో వినోదం, యాక్షన్, బలమైన కథ ఉన్నాయని అర్థమౌతుంది. థ్రిల్లర్ కథలను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన సుధీర్ వర్మ ఈ టీజర్ లో తనదైన మార్క్ చూపించాడు.
కాగా, ఈ మూవీ కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా రూపొందుతుంది. సురేష్ బాబు, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగాఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్‌లకు మంచి స్పందన వస్తోంది. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ ఎంసీ క్లియరీ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.