సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడెందుకు పట్టించుకోరు

V6 Velugu Posted on Dec 20, 2021

కరీంనగర్: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సోమవారం  కరీంనగర్ కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు.  ఈ సందర్భంగా కార్మికులకు సంఘీభావం తెలిపింది కాంగ్రెస్ నేతల బృందం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సమస్యలపై చర్చించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. కరీంనగర్ జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ అంశాన్ని క్యాబినెట్లో చర్చించి సీఎంను నిర్ణయం తీసుకునేలా ఒప్పించాలని డిమాండ్ చేశారు.
 

Tagged MLC Jeevan Reddy, Congress, Sabita Indrareddy, workers

Latest Videos

Subscribe Now

More News