ఇండియా కూటమి బలంగా ఉంది : సచిన్​ పైలట్

ఇండియా కూటమి బలంగా ఉంది  :  సచిన్​ పైలట్

న్యూఢిల్లీ/రాయ్‌‌‌‌గఢ్: ఒకటి రెండు పార్టీలు ఎన్డీయే వైపు మొగ్గు చూపినా ‘ఇండియా’ కూటమి బలంగానే ఉందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. దీంతో ఆందోళన చెందుతున్న బీజేపీ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నదని విమర్శించారు. బీజేపీ తనకు 370 సీట్లు, ఎన్‌‌‌‌డీయేకు 400 పైగా సీట్లు వస్తాయని చెప్పడం వాక్చాతుర్యం తప్ప వాస్తవంకాదని అన్నారు.

ఆదివారం ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. శివసేన, పీడీపీ, అకాలీదళ్, అన్నాడీఎంకే ఇలా అధికార కూటమిని వీడిన పార్టీల సంఖ్యే ఎక్కువని అన్నారు.బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ‘ఇండియా’ కూటమిలోనే ఉన్నారని సచిన్ పైలట్​ చెప్పారు.