
క్రికెట్ లో ఎప్పటికప్పుడూ కొత్త రూల్స్ ఐసీసీ తీసుకొస్తూనే ఉంది. ట్రెండ్ కు తగ్గట్టు ఉన్న రూల్స్ ను మార్చడం, కొత్త రూల్స్ ను ఛేంజ్ చేస్తూ మోడ్రన్ క్రికెట్ లో ఫ్యాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూ వస్తోంది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా, ఇంతా వివాదాస్పదమైనా మాత్రం ఐసీసీ తన వైఖరిని మార్చుకోవడం లేదు. క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐసీసీ మార్చాల్సిన ఆ ఒక్క రూల్ గురించి మాట్లాడారు. రెడ్డిట్‌లో అభిమానులతో "ఆస్క్ మీ ఎనీథింగ్" అనే ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా ఆయన క్రికెట్ మార్చాల్సిన రూల్ గురించి చెప్పుకొచ్చారు. .
ఈ ఇంటరాక్టివ్ లో సచిన్ తన కెరీర్ లో హైలెట్ విషయాల గురించి ప్రశ్నలు అడిగితే చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో తాను మార్చాలనుకున్న రూల్ గురించి ప్రస్తావించారు. మైదానంలో అంపైర్ తీసుకున్న అసలు నిర్ణయం పట్ల ఆటగాళ్ళు అసంతృప్తిగా ఉండటం వల్లే DRS కోసం వెళ్తున్నారని.. అయితే అంపైర్స్ కాల్ నిర్ణయం కారణంగా వారు తీసుకున్న డీఆర్‌ఎస్‌కు అర్ధం లేకుండా పోతుందని సచిన్ అన్నారు. DRS లో అంపైర్స్ కాల్ నిర్ణయాన్ని మార్చాలనుకున్నట్టు సచిన్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
ALSO READ : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్ ఔట్
ఎల్బీడబ్ల్యూ సమీక్షలో అంపైర్స్ కాల్ తరచూ వివాదాస్పదమవుతోంది. అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)లో తరచూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. 2021లో ‘అంపైర్స్ కాల్’ను మార్చాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశంలో తేల్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అంపైర్ ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకుండానే తప్పులు జరగకుండా చూడటం డీఆర్‌ఎస్‌లో ముఖ్య ఉద్దేశం. మైదానంలో ఫీల్డ్ అంపైర్‌దే తుది నిర్ణయం. అంపైర్ కాల్ ఉండాల్సిన అవసరం అందుకే ఉంది’ అని కమిటీ హెడ్, మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే తెలిపారు.
సచిన్ కెరీర్ విషయానికి వస్తే 24 ఏళ్ళ పాటు ఇండియాకు సేవలను అందించాడు. 1989 లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసి 2013 నవంబర్ 16న తన హోం గ్రౌండ్ అయిన వాంఖెడే స్టేడియంలో వెస్టిండీస్ తరుపున తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడి క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఆ మ్యాచ్ లో 74 నాలుగు పరుగులు చేశాడు సచిన్. ఏప్రిల్ 24,1973లో ముంబైలో జన్మించిన సచిన్, 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20 కెరీర్ లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన సచిన్, 34,357 పరుగులు చేశాడు. అందులో 100 సెంచరీలున్నాయి.ఈ ప్రయాణంలో చెప్పలేని గొప్ప ఇన్నింగ్స్ లు ఎన్నో ఉన్నాయి.