
పారిస్: ఇండియా టాప్ షట్లర్ లక్ష్య సేన్‌కు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో చుక్కెదురైంది. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్య 17–21, 19–21తో వరల్డ్ నంబర్‌వన్ షి యు క్వి (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. ఫలితంగా చైనా ప్లేయర్ ముఖాముఖి రికార్డును 4–1కి పెంచుకున్నాడు. 54 నిమిషాల మ్యాచ్‌లో యు క్వి లాంగ్ ర్యాలీస్ ఆడాడు.
అటాకింగ్ గేమ్‌తో బలమైన క్రాస్ కోర్టు విన్నర్లు సంధించిన ఇండియన్ ప్లేయర్‌కు స్మాల్ డ్రాప్స్‌తో చెక్ పెట్టాడు. ఓ దశలో 47 షాట్స్ ర్యాలీని ఆడే క్రమంలో సేన్ చేసిన చిన్న తప్పిదం గేమ్‌ను దూరం చేసింది. విమెన్స్ డబుల్స్‌లో రుతు పర్ణ–శ్వేత పర్ణ12–21, 11–21తో గాబ్రియోలా స్టోయెవా–స్టెఫానీ స్టోయెవా (బల్గేరియా) చేతిలో, ప్రియా–శ్రుతి మిశ్రా 17–21, 16–21తో మార్గోట్ లాంబెర్ట్–కామిల్లా పోగ్నాటి (ఫ్రాన్స్) చేతిలో ఓడారు.