వన్డే క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా బ్యాటర్లకు అనుకూలం

వన్డే క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా బ్యాటర్లకు అనుకూలం

ముంబై: వన్డే క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా బ్యాటర్లకు అనుకూలంగా ఉందని లెజెండరీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ సచిన్‌‌‌‌‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. దీంతో బ్యాట్‌‌‌‌‌‌‌‌, బాల్‌‌‌‌‌‌‌‌కు మధ్య బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ను మరోసారి పరిశీలించాలని కోరాడు. ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని టెస్ట్‌‌‌‌‌‌‌‌లను కూడా అన్ని రకాల పిచ్‌‌‌‌‌‌‌‌లపై ఆడించాలని చెప్పాడు. ‘టీ20లు చాలా ఫాస్ట్‌‌‌‌‌‌‌‌గా ముగిసిపోతున్నాయి. అయితే ఇప్పుడున్న మూడు ఫార్మాట్లు చాలా భిన్నంగా ఉంటాయని నేను భావిస్తున్నా. కానీ వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. బ్యాట్‌‌‌‌‌‌‌‌కు, బాల్‌‌‌‌‌‌‌‌కు మధ్య సరైన బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ లేదు. ప్రస్తుత టైమ్‌‌‌‌‌‌‌‌లో బ్యాటర్‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి బౌలర్‌‌‌‌‌‌‌‌కు కొన్ని ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. రెండు ఎండ్ల నుంచి కొత్త బాల్స్​ వాడటం,  ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ పరిమితుల వల్ల బ్యాటర్‌‌‌‌‌‌‌‌కు ఎక్కడా లేని స్వేచ్ఛ లభిస్తున్నది. బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు’ అని సచిన్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు.