
ముంబై: ఇప్పటి వరకు మ్యాచ్ ల్లో పొరపాట్లు చేస్తే ఫీల్డింగ్ చేస్తున్న జట్లకే పెనాల్టీ వేస్తున్నారని, ఇకపై నిబంధనలు సవరించాల్సిన అవసరముందని ఇండియా లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. శనివారం ముంబై టీ20లీగ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో డెడ్‌బాల్ వివాదాస్పదమైంది. దీనిపై స్పందిస్తూ ఆయా సందర్భాలను బట్టి ఫీల్డింగ్ చేస్తున్న జట్లకే పెనాల్టీలు విధిస్తున్నారని, ఇకపై పొరపాటును బట్టి గరిష్టం గా ఏడు పరుగుల వరకు బ్యాటింగ్ చేస్తున్న జట్లకు పెనాల్టీ విధించాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డాడు.మరోవైపు వామప్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రాక్టీస్ మ్యాచ్ లను అక్కడి వాతావరణానికి అలవాటుపడేందుకు ఉపకరించుకోవాలని కోహ్లీసేనకు సచిన్ సూచించాడు.