
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పెద్ద మనసును చాటుకున్నాడు. క్రిటికల్ వ్యాధులతో బాధపడుతున్న100 మంది అనాథ పిల్లల ట్రీట్ మెంట్ కు అవసరమైన ఆర్థిక సాయం అందించాడు. ఈ మేరకు మాస్టర్ తో కలిసి పని చేస్తున్న చారిటీ ఫౌండేషన్ ‘ఏకం’ ఈ విషయాన్ని వెల్లడించింది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు గవర్నమెంట్ , ట్రస్ట్ హాస్పిటల్స్ లో సరైన ట్రీట్ మెంట్ ఇప్పించడంలో ఏకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగానే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, అసోం, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని అనాథ పిల్లల చికిత్సకు అయ్యే ఖర్చును సచిన్ భరించాడు. ‘సచిన్‌తో అసోసియేషన్ చాలా సంతోషంగా సాగిపోతున్నది. హెల్త్ కేర్ విభాగంలో మాస్టర్ చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నాడు. అనాధ పిల్లలకు క్వాలి టీ ట్రీట్ మెంట్ ఇప్పించడంలో టెండూల్కర్ ఫౌండేషన్ మాకు అవసరమైన సపోర్ట్ అందిస్తున్నది’ అని ఏకం ఫౌండేషన్ మేనేజింగ్ పార్ట్ నర్ అమితా చటర్జీ వెల్లడించారు. ఇటీవలే సచిన్ అసోంలోని కరీమ్ గంజ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ముకుందా హాస్పిటల్‌కు పెడియాట్రిక్ ఎక్విప్‌మెంట్ ను అందజేశాడు. ఈ పరికరాల వల్ల ప్రతి ఏడాది 2 వేల మంది పిల్లలు ప్రయోజనం పొందనున్నారు.