వీడియో: కొడుకుకు హెయిర్ కట్ చేసిన సచిన్ టెండూల్కర్

వీడియో: కొడుకుకు హెయిర్ కట్ చేసిన సచిన్ టెండూల్కర్

తన బ్యాటింగ్ శైలితో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్. చాలామంది ఆటగాళ్లకు ఆయనే ఇన్పిరేషన్. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే సచిన్.. తాజాగా తన కొడుకు అర్జున్ టెండూల్కర్ కు హెయిర్ కట్ చేసి.. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. లాక్డౌన్ వల్ల మొన్నటివరకు దాదాపు అన్ని షాపులు మూతపడ్డాయి. తాజాగా రెండురోజుల క్రితం కేంద్రం ఇచ్చిన కొన్ని సడలింపుల వల్ల ఇప్పుడిప్పుడే షాపులన్ని తెరచుకుంటున్నాయి. అయితే కటింగ్ షాపులు మాత్రం అక్కడక్కడ మాత్రమే తెరచుకుంటున్నాయి. అయినా ప్రజలు మాత్రం కరోనా సోకుతుందనే భయంతో కటింగ్ షాపులకు వెళ్లడంలేదు.

ఆ ఉద్దేశంతోనే సచిన్ కూడా తన కొడుకు అర్జున్ కు ఇంట్లోనే హెయిర్ కట్ చేశాడు. సచిన్ కు అసిస్టెంట్ గా ఆయన కూతురు సారా సాయం చేసింది. ఆ వీడియోను సచిన్ తన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘ఒక తండ్రిగా మీరు ప్రతిదాన్ని చేయాలి. అది మీరు మీ పిల్లలతో ఆటలు ఆడటం కావచ్చు, వారితో జిమ్ చేయడం కావచ్చు లేదా వారి జుట్టును కత్తిరించడం కూడా కావచ్చు. హెయిర్ కట్ వల్ల అందరూ అందంగా కనబడతారు. అర్జున్ హెయిర్ కట్ కు సాయం చేసిన సారాకు నా ధన్యవాదాలు’ అని సచిన్ ఆ వీడియోకు ట్యాగ్ చేశాడు. గత నెలలో సచిన్ తన హెయిర్ ను తానే కట్ చేసుకొని కొన్ని ఫొటోలను పోస్టు చేశాడు. ఇప్పుడు తన కొడుకుకు హెయిర్ కట్ చేశాడు.

For More News..

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి

తన నిర్ణయాన్ని సమర్థించుకున్న డోనాల్డ్ ట్రంప్