సచిన్ ‘వుమెన్స్ డే’ గిఫ్ట్: వంట చేసి అమ్మకు తినిపించాడు

సచిన్ ‘వుమెన్స్ డే’ గిఫ్ట్: వంట చేసి అమ్మకు తినిపించాడు

‘వుమెన్స్ డే’ సందర్భంగా టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ‘కుక్’ అవతారం ఎత్తాడు. తన తల్లి రజని, భార్య అంజలి, కూతురు సారాల కోసం ప్రత్యేకంగా కర్రీ రెడీ చేశాడు. ఈ విధంగా తన జీవితంలో మొయిన్ రోల్ ప్లే చేస్తున్న మహిళలకు శుభాకాంక్షలు చెప్పానని ట్వీట్ చేశారు సచిన్. ఉమెన్స్ డే రోజున మన జీవితాల్లో ఉన్న మహిళల కోసం ఏదో ఒకటి ప్రత్యేకంగా చేద్దాం అంటూ తాను చేసిన వంట వీడియోను ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు.