Satyabhama: పరిచయాలను గట్టిగా వాడేస్తున్న కాజల్..మొన్న బాలయ్య..ఇపుడు మరో బిగ్ స్టార్!

Satyabhama: పరిచయాలను గట్టిగా వాడేస్తున్న కాజల్..మొన్న బాలయ్య..ఇపుడు మరో బిగ్ స్టార్!

పెళ్లి తరువాత సినిమాలు తగ్గించిన కాజల్ అగర్వాల్(Kajal Agarwal) ప్రస్తుతం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాలో నటించింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని సాధించింది.

భగవంత్ కేసరి తరువాత కాజల్ సత్యభామ(Satyabhama)అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. కాజల్ పోలీస్ ఆఫిసర్ గా చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు సుమన్ చిక్కాలా(Suman Chikkala) తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దీంతో సత్యభామ చిత్రాన్ని వీలైనంతగా జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి కాజల్ అగర్వాల్ స్ట్రాంగ్ ప్రమోషన్ చేస్తోంది. అందుకు తన సీనియారిటీని ఉపయోగిస్తునే..పరిచయాలను కూడా వాడేస్తోంది. 

అందులో భాగంగానే రీసెంట్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి క్వీన్ అఫ్ మాసెస్ కోసం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బాబు అటెండ్ అయ్యి మంచి హైప్ ఇచ్చారు. అంతేకాదు..సత్యభామ షోకి నందమూరి ఫ్యాన్స్ భారీగా వచ్చారు. దీంతో రిలీజ్ అయిన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు అదనపు బలం బాలయ్య బాబు రావడం మరింత అది రెట్టింపు అయింది.

ఇక తాజాగా కాజల్ భామ కోసం మరో స్టార్ హీరో రానున్నారు. కాజల్ సినిమా కెరియర్ స్టార్టింగ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా మగధీర  మూవీలో కాజల్ అగర్వాల్ నటించింది. ఈ మూవీతో వీరిద్దరూ టాలీవుడ్ స్టార్స్ గా మారారు. మగధీర నుంచి వీరి మధ్య స్నేహం కంటిన్యూ అవుతుంది..ఇక మధ్యలో గోవిందుడు అందరివాడిలే సినిమాకూడా చేసి అలరించారు. 

ఈ నేపథ్యంలో సత్యభామ మూవీ  ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ వస్తే..మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా తోడవుతుందని కాజల్ భావిస్తోందట. ఇక కాజల్ అగర్వాల్ రిక్వెస్ట్ మేరకు ఆమెకి సపోర్ట్ గా నిలబడటానికి చరణ్ బాబు సత్యభామ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్ లో వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై సత్యభామ మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొన్న నందమూరి ఫ్యాన్స్..ఇపుడు మెగా ఫ్యాన్స్..పట్టిస్తుండటంతో కాజల్ ప్లాన్ అదుర్స్ అంటూ సొషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.