2వేల లీటర్ల డీజిల్, పెట్రోల్.. 33 మంది చావుకు కారణమైంది

2వేల లీటర్ల డీజిల్,  పెట్రోల్.. 33 మంది చావుకు కారణమైంది

రాజ్‌కోట్ గేమ్మింగ్ జోన్ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 33కి చేరింది. గుజరాత్ లోని టీఆర్పీ గేమ్ జోన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అందులో 300 మంది ఉన్నట్లు అధికారులు వివరాలు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఎక్కువగా మైనర్లే ఉన్నారు. రాజ్‌కోట్ సిటీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పోలీసులు ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు  పరిస్థితులను పరిశీలిస్తున్నారు. గేమ్ జోన్ లో 2వేల డీజిల్, 1500ల పెట్రోల్ నిల్వలు ఉన్నాయని దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. డెడ్ బాడీలు కాలిపోయి గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. డీఎన్ఏ పరీక్షలు చేసి మృతదేహాలను ఫ్యామిలీస్ కు అప్పగిస్తున్నారు. రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్‌లో బాధిత కుటుంబాల ఆర్తనాథాలో మారుమోగుతున్నాయి. సాధారణంగా రూ.500 టికెట్ ఉండగా.. ఆఫర్ అని రూ.99లకే ఎంట్రీ ఇచ్చారంటా అందువల్లనే శనివారం (మే25) గేమ్ జోన్ లో పర్యటకుల రద్దీ పెరింగింది.