Netflix Most Watched Movies: నెట్‌ఫ్లిక్స్..ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమాలు..వెబ్ సిరీస్‌లు ఇవే..

Netflix Most Watched Movies: నెట్‌ఫ్లిక్స్..ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమాలు..వెబ్ సిరీస్‌లు ఇవే..

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఉన్నప్పటికీ..నెట్‌ ఫ్లిక్స్ (Netflix) కు మాత్రం  అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంతెందుకు..నెట్‌ఫ్లిక్స్ తర్వాతే మిగతా ఓటీటీస్ అన్నట్లుగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు..నెట్‌ఫ్లిక్స్ ఎంచుకునే సినిమాల కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ కంటెంట్:

ప్రస్తుతం..నెట్‌ఫ్లిక్స్ లో సినిమా వస్తుందంటే..ఆ సినిమాలో ఏదో బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది. తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత. అంతేకాదు..ఇండియన్ సినిమాలు, షోలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఒక్క ఏడాదిలోనే 100 కోట్ల వ్యూస్ రావడం నెట్‌ఫ్లిక్స్ యొక్క ప్రత్యేకత.

తాజాగా శుక్రవారం (మే 24న) ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ తన రెండో ఎంగేజ్‌మెంట్ రిపోర్టును వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం 2023 ఏడాదికిగాను ఇండియన్ సినిమాలు, పలు మోస్ట్ వాచ్ డ్ షోలకు ఏకంగా 100 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. "వాట్ వి వాచ్డ్: ఎ నెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ రిపోర్టు" పేరుతో ఈ రిపోర్టును ఓటీటీ రిలీజ్ చేసింది. గతేడాది జులై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి ఈ రిపోర్టును తీసుకొచ్చింది.

నెట్‌ఫ్లిక్స్ సినిమాలు..వెబ్ సిరీస్‌లు

గతేడాది జులై నుంచి డిసెంబర్  అంటే (రెండో అర్ధభాగంలో) ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ వ్యూయర్స్ 9000 గంటల నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ను చూడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.అయితే, ఇండియా నుంచి సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన హిందీ మూవీ జానే జాన్ ని ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలిచింది.కరీనా కపూర్‌ నటించిన మిస్టరీ థ్రిల్లర్‌  మూవీకి ఏకంగా 2.02 కోట్ల వ్యూస్ రావడం విశేషం.

ఆ తర్వాత డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన షారుక్ ఖాన్ జవాన్ నిలిచింది. ఈ సినిమాకు 1.62 కోట్ల వ్యూస్ వచ్చాయి. మూడో స్థానంలో 1.21 కోట్ల వ్యూస్ తో విశాల్ భరద్వాజ్ ఖూఫియా(12.1M) రాగా..OMG -2 (11.5M), లస్ట్ స్టోరీస్ 2(9.2M).. ఇకఇవేకాకుండా డ్రీమ్ గర్ల్ 2, కర్రీ అండ్ సయనైడ్ లాంటి సినిమాలు, సిరీస్, డాక్యు సిరీస్ ఉన్నాయి. 

ఇక నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే..మాధవన్ నటించిన ది రైల్వే మెన్ (10.6M) తో టాప్ లో నిలిచింది. 1984 భోపాల్ గ్యాస్ లీక్ విషాద నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్..1.06 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. కోహ్రా వెబ్ సిరీస్(6.4M)తో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గన్స్ అండ్ గులాబ్స్(6.4M), కాలా పానీ సిరీస్ 5.4M) ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్స్ 

2023 మిడిల్ ఇయర్ లో ఉన్నప్పుడు నెట్‌ఫ్లిక్స్ కి 240 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు ప్రకటించింది. ప్రసెంట్ 2024 లెక్కల ప్రకారం..నెట్‌ ఫ్లిక్స్ కు వరల్డ్ వైడ్ గా 269 మిలియన్ల సబ్‌ స్క్రైబర్స్ ఉన్నట్లుగా మీడియా సంస్థలు వెల్లడించాయి.

ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోని సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. దీంతో మరికొన్ని రోజుల్లో నెట్ఫ్లిక్స్కు సబ్‌స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. 2024 లో మోస్ట్ అవైటెడ్ మూవీలైన జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మూవీస్ నెట్ఫ్లిక్స్ లో రానున్నాయి.