Prabhas: వీరాభిమాని మరణవార్త విని..ప్రభాస్ ఏం చేశాడో తెలుసా?

Prabhas: వీరాభిమాని మరణవార్త విని..ప్రభాస్ ఏం చేశాడో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఇండస్ట్రీలో స్టార్గా ఎంత గుర్తింపు ఉందో..సామాజిక విషయాలలో కూడా అంతే మంచి పేరుంది.అందుకే ప్రభాస్‌ను అందరూ డార్లింగ్ అంటూ ప్రేమతో పిలుస్తారు.సినిమాల విషయం పక్కన పెడితే..ఒక మంచి మనిషిగా ఎదుటివారికి సాయం చేసే విషయంలో ప్రభాస్ ఎప్పుడూ ముందు ఉంటారు.ఇకపోతే ఆయనకి ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో..వారి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  

తాజాగా కరీంనగర్ కు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేష్ ఈ మధ్యకాలంలో మరణించారు. వీరాభిమానిగా ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో పాల్గొనే రమేష్ మరణ వార్త తెలుసుకున్న ప్రభాస్..ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో వెంటనే ప్రభాస్ పిఏ రామకృష్ణను శనివారం (మే 25) నాడు వారి కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయం అందించమని పంపించాడు. అలాగే రమేష్ పేరిట కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది.ఇక ఈ విషయం తెలుసుకున్న రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ప్రభాస్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.ఈ మూవీ 2024 జూన్ 27న రిలీజ్ కానుంది.