భద్రాద్రి ఆలయంలోని అర్చకులకు, వేద పండితులకు మెమోలు జారీ

భద్రాద్రి ఆలయంలోని అర్చకులకు, వేద పండితులకు మెమోలు జారీ

భద్రాద్రి ఆలయంలోని అర్చకులకు, వేద పండితులకు మెమోలు జారీ చేశారు ఆలయ ఈవో. రామనారాయణ, ప్రవర విషయంలో హైకోర్టు ఉత్తర్వులతో ఐదుగురు సభ్యులకు కమిటీని నియమించింది ప్రభుత్వం. కమిటీ సూచనల మేరకు వివరణ కోరుతూ అర్చకులకు, వేద పండితులకు మెమోలు జారీ చేశారు ఆలయ ఈవో.  శ్రీరామనవమి కళ్యాణ సందర్భంగా ప్రవర మార్చి చదువుతున్నారంటూ అర్చకులకు, వేద పండితులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు హైకోర్టును ఆశ్రయించారు.  

భద్రాచలంలో దశాబ్ద కాలంగా రామనారాయణుడి వివాదం రగులుతున్నే ఉంది.   భద్రాచలంలో రాముడు ఉన్నాడా.. రామ నారాయణుడు ఉన్నాడా.. అనే విషయమై చాలా కాలంగా వివాదం  సాగుతుంది. భద్రాద్రి రాముడికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా నిత్యం కల్యాణం నిర్వహిస్తుంటారు. ఏటా శ్రీరామనవమి రోజు వైభవంగా కల్యాణ క్రతువు జరిపిస్తుంటారు. ఈ క్రతువులో భాగంగా ప్రవర పఠించేటప్పుడు రాముడిని అర్చకులు రామనారాయణుడు అని సంబోధిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.