
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ నివాసానికి వచ్చిన బాలకృష్ణ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం కాసేపు సీఎంతో బాలకృష్ణ ముచ్చటించారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తరువాత బాలకృష్ణ ఆయన్ను కలవడం ఇది రెండోసారి. అంతకుముందు గతేడాది డిసెంబర్ లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిశారు బాలకృష్ణ.