త్వరలో రాష్ట్రమంతటా‘సద్దిమూట’

త్వరలో రాష్ట్రమంతటా‘సద్దిమూట’

 హైదరాబాద్‌‌, వెలుగు: మార్కె ట్‌ లో రైతుల ఆకలి తీర్చేం దుకు తీసుకొచ్చిన ‘సద్దిమూట’ పథకాన్ని రాష్ట్రం లోని అన్ని మార్కెట్లకు విస్తరించాలని సర్కారు ఆలోచన చేస్తోంది. యార్డుల్లో ధాన్యం అమ్మకాలు సకాలంగా కొనసాగక రైతులు రోజల తరబడి వేచిచూడాల్సి ఉంటోంది. వీరి కోసం ‘సద్దిమూట’ పథకంలో భాగంగా రూ.5కే భోజనాన్ని అందిస్తున్నారు. బోయిన్‌ పల్లి, కేసముద్రం, నిజామాబాద్‌, గజ్వేల్‌ , సిద్దిపేట, మహబూబ్‌ నగర్‌‌, ఆదిలాబాద్‌ మార్కె ట్లలో ప్రస్తుతం సద్దిమూట కార్యక్రమం కొనసాగుతోంది.

హరే కృష్ణ మూమెంట్‌ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం .. ఈ ట్రస్టు అందుబాటులో లేనిచోట ఇతర సంస్థల సహకారం తీసుకోవాలని భావిస్తోంది. దీని నిర్వహణ కోసం స్వచ్ఛంద సంస్థలు, దాతల నుంచి విరాళాలు సేకరిం చనున్నారు. ప్రతి మార్కెట్‌ లో పరిస్థితులను బట్టి 500 మంది రైతులకు, యార్డుల్లో పనిచేస్తున్న కార్మికులకు  ‘సద్దిమూట’ అందించాలని నిర్ణయిం చారు.

ఒక్క భోజనం ఖర్చు రూ.25

ఒక్కో భోజనం కోసం ప్రభుత్వం రూ.25 ఖర్చు చేయనుంది. రూ.10 మార్కెటింగ్‌‌శాఖ, స్వచ్ఛంద సంస్థలు, విరాళాల ద్వారా రూ.10, రూ.5 రైతుల నుంచి తీసుకోనున్నారు.