
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఒక సాధువు దారుణ హత్యకు గురయ్యారు. ఉమ్రీలోని తన ఆశ్రమంలో ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు మీడియాకు వెల్లడించారు. సాధువును శివాచార్య పశుపతి నాథ్ మహారాజ్‌గా గుర్తించారు. శివాచార్య హత్యకు గురైన అదే మఠంలోని బాత్రూంలో మరొక వ్యక్తి మృతదేహం కనుగొన్నామని నాందేడ్ పోలీసు సూపరింటెండెంట్ విజయకుమార్ చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆశ్రమాన్ని కొల్లగొట్టి ఆపై సాధు గొంతు కోసి చంపినట్లు ప్రాథమిక రిపోర్టులో తేలిందన్నారు. స్పాట్ ను పరిశీలించిన ఎస్పీ విజయ్ కుమార్.. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మర్డర్ కి కారణాలు అన్వేషిస్తున్నామని, ఆశ్రమంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు. కొద్దిరోజుల కిందటే పాల్‌ఘర్ జిల్లాలో ఇద్దరు సాధువులను కొట్టి చంపిన ఘటన మరువకముందే మరొక సాధు మర్డర్ జరగడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు.