
టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు నేతలు బయటికొచ్చారు. తాజాగా టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన యామిని సాదినేని ఆ పార్టీకి రాజీనామా చేసారు.. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన యామిని, ఎన్నికల తరువాత సైలెంట్ అయ్యారు. అయితే టీడీపీ ఓటమి తరువాత యామిని వైసీపీలో చేరుతారన్న వార్తలు హల్ చల్ చేసాయి, కానీ ఆమె వాటిపై స్పందించలేదు. తాజాగా టీడీపీ వాట్సప్ గ్రూప్‌లో తన రాజీనామా లేఖను యామిని పోస్టు చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నాయని ఆమె అందులో పేర్కొన్నారు. దేశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బలమైన కారణాల వల్లే టీడీపీకి రాజీనామా చేశానని ఆమె ప్రకటించారు.యామిని రాజీనామాతో తెలుగు తమ్ముళ్లలో కొంత నిరాశ కనబడుతుంది.. యామిని మరో రెండు, మూడు రోజుల్లోతన భవిషత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ ఫైర్ బ్రాండ్ రీ ఎంట్రీ ఏ పార్టీలోకి అన్న సస్పెన్స్ కొనసాగుతుంది..!