గత బీఆర్ఎస్ ​ప్రభుత్వ నిర్వాకం వల్లే.. సాగర్​ ఎండిపోయే పరిస్థితి : మంత్రి ఉత్తమ్

గత బీఆర్ఎస్ ​ప్రభుత్వ నిర్వాకం వల్లే.. సాగర్​ ఎండిపోయే పరిస్థితి : మంత్రి ఉత్తమ్

 గత బీఆర్ఎస్​ప్రభుత్వ నిర్వాకం వల్లనే నాగార్జునసాగర్​ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘రాయలసీమ లిఫ్ట్​ఇరిగేషన్​స్కీమ్ ప్రాజెక్ట్ టెండర్​ప్రక్రియ జరగకుండా చూడాలంటూ కేఆర్ఎంబీకి 2020 జులై 25న నాటి ఈఎన్సీ లేఖ రాశారు. అదే ఏడాది ఆగస్టు 10 నాటికి ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టు టెండర్​ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. నిజానికి దానికి ఐదు రోజుల ముందే అంటే ఆగస్టు 5న అపెక్స్​కౌన్సిల్​మీటింగ్​జరగాల్సి ఉంది.

 కానీ, ఆ మీటింగ్​ను వాయిదా వేయాలంటూ 2020 జులై 30న నాటి చీఫ్​సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు. ఆగస్టు 20 తర్వాత మీటింగ్​పెట్టాలని కోరారు. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతోనే రాయలసీమ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచేసింది. అపెక్స్ కౌన్సిల్​షెడ్యూల్​చేసిన రోజు మీటింగ్​కు పోయి ఉంటే టెండర్​ ప్రక్రియను ఆపి ఉండవచ్చు. కానీ, ఏపీకి సాయం చేయాలనే కేసీఆర్ ఇలా చేశారు. సుప్రీంలో ఉన్న కేసుపైనా నాటి ప్రభుత్వం స్పందన ఇవ్వలేదు’’ అని చెప్పారు.