నాగ్‌పూర్: ఐటీఎఫ్ విమెన్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి సహజ యమలాపల్లి.. క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సహజ 6–2, 6–1తో సోనల్ పాటిల్‌పై గెలిచింది. ఆరంభం నుంచే బలమైన సర్వీస్‌లతో చెలరేగిన సహజ కీలక టైమ్‌లో నాలుగు బ్రేక్ పాయింట్లను కాచుకుంది. రెండో సెట్‌లో మరింత దూకుడుగా ఆడి ప్రత్యర్థికి ఈజీగా చెక్ పెట్టింది. క్వార్టర్స్‌లో సహజ.. డాయెన్ బ్యాక్ (కొరియా)తో తలపడుతుంది. డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో శ్రీవల్లి రష్మిక భమిడిపాటి–వైదేహి చౌదరీ 6–2, 7–6 (0)తో ఫ్యానీ ఔస్ట్‌లుండ్ (స్వీడన్)–ఎకతెరినా యోషినా (రష్యా)పై నెగ్గి సెమీస్‌లోకి ప్రవేశించారు.
