
సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. తాజాగా ‘నచ్చావులే.. నచ్చావులే’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ కంపోజ్ చేసిన ఈ పాటను కార్తీక్ పాడాడు. ‘తడబడని తీరు నీదే.. తెగబడుతూ దూకుతావే.. ఎదురు పడికూడా.. ఎవరోలా నను చూస్తావే, బెదురు మరి లేదా.. అనుకున్నదే నువు చేస్తావే.. నచ్చావులే నచ్చావులే.. ఏరోజు చూశానో ఆరోజే.. నచ్చావులే నచ్చావులే.. నీ కొంటె వేశాలే చూశాకే’ అంటూ కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. పల్లెటూరి అమ్మాయిగా లంగావోణి, చీరకట్టులో ఆకట్టుకుంది సంయుక్త. ఆమె క్యారెక్టర్‌ను తేజ్ వర్ణిస్తున్నట్టుగా ఈ పాట సాగింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న సినిమా విడుదల కానుంది.