
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మెట్టు సాయి కుమార్ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హెచ్చరించారు. ఆదివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది డెడ్లీ వార్నింగ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎందరో చెంచాలు ఉన్నారని, అందులో కౌశిక్ రెడ్డి ఒకరని ఆరోపించారు.
కేటీఆర్ మెప్పు కోసం ఇంకోసారి సీఎం రేవంత్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తూ తెలంగాణను ప్రగతిపథంలో నడిపిస్తున్న రేవంత్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని విమర్శించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు జనం తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు