Prabhas Kalki2 : ప్రభాస్ సరసన సాయి పల్లవి.. 'కల్కి2' కోసం నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్!

Prabhas Kalki2 : ప్రభాస్ సరసన సాయి పల్లవి.. 'కల్కి2' కోసం నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్!

రెబల్ స్టార్ ప్రభాస్ , దర్శకుడు నాగ్ అశ్వీన్ కాంబినేషన్ లో వచ్చిన  చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత విజువల్ వండర్ గా నిలిచింది. , సైన్స్ ఫిక్షన్‌ను మేళవించి నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ ప్రపంచం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు దీని సీక్వెల్ పార్ట్ 2పై ఫోకస్ పెట్టిన అశ్వీన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్ లో నటిగా ఎవరు ఉంటారని అసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 'కల్కి2'లో నేచరల్ బ్యూటీ సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

సుమతి పాత్రలో మార్పు?

మొదటి భాగంలో కథ మొత్తం దీపికా పదుకోన్ పోషించిన ‘సుమతి’ పాత్ర చుట్టూనే తిరిగింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల సీక్వెల్ నుండి దీపికా వైదొలగింది. ఈ విషయాన్ని మేకర్స్ గత సెప్టెంబర్‌లోనే అధికారికంగా వెల్లడించారు.. దీంతో ఆ కీలకమైన పాత్రను ఎవరు భర్తీ చేస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలోనే ఆలియా భట్, ప్రియాంకా చోప్రా వంటి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ చివరికి సాయి పల్లవి పేరును మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

సాయి పల్లవి ఎంపికకు కారణమేంటి?

కల్కి సీక్వెల్‌లో భావోద్వేగాలకు పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా కల్కి తల్లిగా సుమతి పడే వేదన, ఆ పాత్రలోని డెప్త్‌ను పండించాలంటే అద్భుతమైన నటి కావాలని నాగ్ అశ్విన్ భావించినట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి ఉన్న సహజమైన నటన, ఎమోషనల్ సీన్స్‌లో ఆమె చూపించే ప్రతిభ ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. దీపికా పదుకోన్ వంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటి స్థానంలో సాయి పల్లవిని తీసుకోవడం వల్ల కథకు మరింత నేచురల్ లుక్ వస్తుందని భావిస్తున్నారు. అయితే సాయి పల్లవి ఎంపికపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

షూటింగ్ ఎప్పటినుంచంటే?

ప్రభాస్ అభిమానులకు మరో తీపి కబురు ఏంటంటే.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని సమాచారం. ‘కల్కి 2’తో పాటు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాను కూడా సమాంతరంగా షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ పనులు ఉన్నందున 2027 ఆరంభంలో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి..

అయితే ఈ 'కల్కి 2'లో సాయి పల్లవి ఎంట్రీ ఇస్తుందన్న  వార్తలపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఒక వర్గం ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అవుతూ.. "కల్కి తల్లిగా సాయి పల్లవి అయితేనే పర్ఫెక్ట్" అని కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు దీపికా స్థానాన్ని ఆమె భర్తీ చేయగలదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, ఒకవేళ ఈ వార్త నిజమైతే సాయి పల్లవి కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడుతున్నారు..