ఎన్టీఆర్కు తల్లిగా సాయి పల్లవి.. దేవర నుండి క్రేజీ న్యూస్

ఎన్టీఆర్కు తల్లిగా సాయి పల్లవి.. దేవర నుండి క్రేజీ న్యూస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్(RRR) వంటి గ్లోబల్ హిట్ తరువాత.. ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను నెక్స్ట్ లెవల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. 

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ సినిమా నుండి వినిపిస్తున్న క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు అనే విషయం తెలిసిందే. అందులో ఒకటి తండ్రి పాత్ర. సెకండ్ హాల్ఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలువనుందని సమాచారం.

చాలా పవర్ ఫుల్ గా ఉండే పాత్రకి జోడీగా హుందాగా ఉండే స్టార్ కోసం చూశారట మేకర్స్. అందుకే ఈ పాత్ర కోసం నాచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi)ని తీసుకొనున్నారు అని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక కొడుకు పాత్రకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) ను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.