సాయిపల్లవి గార్గి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సాయిపల్లవి గార్గి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

విరాటపర్వం తర్వాత సాయిపల్లవి నటిస్తున్న మూవీ గార్గి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీని జులై 15న విడుదల చేయనున్నట్లు సాయిపల్లవి తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. గౌతమ్ రామచంద్రన్ డైరెక్షన్ లో లేడి ఓరియెంటెడ్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో సాయిపల్లవి వైవిధ్యమైన పాత్రలో కనిపించనుందని టాక్. ఇక సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలకు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీని తమిళంలో 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక రిలీజ్ చేస్తున్నారు. 96ఫేం గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన విరాటపర్వంలో వెన్నెల పాత్రతో అందరినీ ఆకట్టుకుంది సాయిపల్లవి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయిన సాయిపల్లవి పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక గార్గిలో కూడా సాయిపల్లవి తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తోందని చిత్ర యూనిట్ చెబుతోంది.