తండ్రి కోసం కూతురి న్యాయపోరాటం

తండ్రి కోసం కూతురి న్యాయపోరాటం

‘విరాటపర్వం’ చిత్రంతో ఆకట్టుకున్న సాయిపల్లవి, నెల రోజులు తిరక్కుండానే ‘గార్గి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. గౌతమ్ రామచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ లేడీ ఓరియెంటెడ్‌‌ మూవీ జులై 15న  తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది. నిన్న ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘నేనొక టీచర్‌‌‌‌ని, ఒక్కరోజులో మా జీవితాలు తల్లక్రిందులయ్యాయి. నాన్నని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. ఏ స్టేషన్‌‌లో ఉంచారో కూడా తెలియలేదు’ అంటూ సాయిపల్లవి చెప్పే డైలాగ్స్‌‌తో కథని, ఆమె పాత్రని పరిచయం చేశారు. కచ్చితమైన ఆధారాలున్నాయంటున్నారు పోలీసులు.

కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ వాదిస్తోన్నది మాత్రం ఓ జూనియర్ లాయర్. దాంతో ఒక్క అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కు పడుతున్నాయి. ఇంట్లోనూ ఆమెకు సపోర్ట్ లేదు. తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్తోంది తల్లి. ‘రాత, విధి, టైమ్ లాంటివన్నీ నమ్ముతావమ్మా.. నన్ను మాత్రం నమ్మవు.. ఎందుకంటే నేను మగ పిల్లాడిని కాదుగా’ అంటూ సాయిపల్లవి వాపోతోంది. మరి చివరికి ఏం జరిగింది, ఆమె తన తండ్రిని కాపాడుకోగలిగిందా లేదా అనేది మిగతా కథ. ట్రైలర్‌‌‌‌ ఎంతో ఎమోషనల్‌‌గా సాగింది. తండ్రి కోసం న్యాయపోరాటం చేస్తున్న కూతురిగా సాయిపల్లవి నటన ఇంప్రెసివ్‌‌గా ఉంది. తమిళంలో హీరో సూర్యకి చెందిన 2డి ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. తెలుగులో సురేష్‌‌ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్‌‌ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.