నాగ చైతన్యతో సాయి పల్లవి మరో లవ్స్టోరీ

నాగ చైతన్యతో సాయి పల్లవి మరో లవ్స్టోరీ

నాగ చైతన్య(Naga Chaitanya)..చందూ మొండేటి(Chandoo Mondeti),  క్రేజీ కాంబోలో మరో మూవీ(NC23) రాబోతుంది. ప్రేమమ్ మూవీ తో మంచి హిట్ అందుకున్న వీరు..త్వరలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కొంతకాలంగా హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసే పనిలో పడ్డ మేకర్స్..ఇవాళ (సెప్టెంబర్ 20న) సాయి పల్లవి(Sai Pallavi)ని ఫైనల్ చేశారు.

ఇదే విషయంపై సాయి పల్లవి స్పందిస్తూ..నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులు, నేను మీ అందరిని మిస్ అయ్యాను..ఇప్పుడు మరోసారి NC23 ద్వార మిమ్మల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను..అంటూ ట్వీట్ చేసింది. ఇక లవ్ స్టోరీ మూవీతో అడయాన్స్ ను ఫిదా చేసిన ఈ జంట మరోసారి పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ లో నటిస్తుండటంతో క్యూరియాసిటీ పెరిగిపోయింది. 

ఈ మూవీ.. శ్రీకాకుళం నుండి గుజరాత్ కు వలస వెళ్లే మత్స్యకారుల కుటుంబాల నేపథ్యంలో కథను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.అలాగే కొంత మంది మత్స్యకారులు పాకిస్థాన్ బార్డర్ కు తప్పి పోవడంతో..తిరిగి ఇండియాకి రావడానికి ఎదుర్కొన్న పరిస్థుతుల నేపథ్యంతో ఈ మూవీ స్టోరీ సాగునుందని తెలుస్తోంది. అందులో భాగాంగా స్టోరీలో ఒక అందమైన ప్రేమ కథను చూపిస్తున్నట్టు సమాచారం.ఈ మూవీలో చైతు బోటు డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ మూవీకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్(Anirudh) స్వరాలు అందించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనిరుధ్ కనుక ఈ ప్రాజెక్ట్ లో చేరితే ఈ సారి చైతూకు హిట్ పడడం పక్కా అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్గీ త ఆర్ట్స్(Geeta Arts) బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు (Allu Aravind) ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. 

రీసెంట్ గా కార్తీకేయ 2 మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరిన చందు మొండేటి.. చైతన్యకు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. ఈ మూవీను ఇదే ఏడాది స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.