న్యూఢిల్లీ: ఫార్మా ఇంజెక్టబుల్స్, ఫార్ములేషన్స్తయారు చేసే హైదరాబాద్‌కు చెందిన సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ (ఎస్‌పీఎల్), ఆస్ట్రేలియాకు చెందిన నౌమెడ్ ఫార్మాలో 74.6 శాతం వాటాను రూ.125 కోట్లకు దక్కించుకుంది. ఇది తమ గ్లోబల్ విస్తరణ వ్యూహంలో కీలక మైలురాయి అని ఎస్‌పీఎల్ ఎండీ కేకే అనిల్ ప్రకటించారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘నౌమెడ్ సుమారు 60 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ఆదాయం గల కంపెనీ. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని ఫార్మసీ చైన్లకు ఓటీసీ ఉత్పత్తులను అందిస్తుంది. 451 ప్రొడక్ట్ డోసియర్ల పోర్ట్‌ఫోలియో దీని సొంతం.
ఇప్పుడు ఈ కొనుగోలు ద్వారా, ఈ 450 ఉత్పత్తులను తయారు చేయడానికి, గ్లోబల్ మార్కెట్లలో అమ్మడానికి సంబంధించిన మేధో సంపత్తి (ఐపీ) హక్కులు మాకు వస్తాయి. అడిలైడ్‌లో ప్లాంటు ఏర్పాటుకు నౌమెడ్ ఆస్ట్రేలియా నుంచి 20 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల గ్రాంటు పొందింది. వచ్చే ఏడాది నాలుగో క్వార్టర్లో ప్రొడక్షన్ మొదలవుతుంది”అని ఆయన వివరించారు. ఎస్‌ఏఐ ఐపీఓకు రెడీ అయింది. డీఆర్‌హెచ్‌పీని ఈ ఏడాది సెప్టెంబరులో సెబీకి అందజేసింది.
ఇందులో రూ.285 కోట్ల తాజా ఇష్యూ, 35 లక్షల ఈక్విటీ షేర్ల ఓఎఫ్‌ఎస్ ఉంటుంది. ఐపీఓ నిధుల్లో రూ.110 కోట్లను రెండు నాన్-రెగ్యులేటరీ ప్లాంట్లను యూరోపియన్ జీఎంపీ ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగిస్తారు. రూ.2,6-27 కోట్లతో బొల్లారంలో అత్యాధునిక ఆర్అండ్డీ కేంద్రాన్ని స్థాపిస్తారు. ఈ కేంద్రం ద్వారా సీడీఎంఓ వ్యాపారాన్ని బలోపేతం చేయాలని కంపెనీ యోచిస్తోంది. తమ కంపెనీ 2028-–-29 నాటికి పూర్తి సామర్థ్యంతో పని చేస్తుందని, బలమైన గ్లోబల్ కంపెనీగా మారుతుందని అనిల్ చెప్పారు.
