సాయి సుదర్శన్‌‌‌‌కు గాయం.. ఆటకు ఆరు వారాలు దూరం

సాయి సుదర్శన్‌‌‌‌కు గాయం.. ఆటకు ఆరు వారాలు దూరం

న్యూఢిల్లీ: విజయ్‌‌‌‌ హజారే ట్రోఫీలో గాయపడిన తమిళనాడు బ్యాటర్‌‌‌‌ సాయి సుదర్శన్‌‌‌‌ ఆరు వారాల పాటు క్రికెట్‌‌‌‌కు దూరం కానున్నాడు. మధ్యప్రదేశ్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో డైవింగ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ను అందుకునే క్రమంలో సుదర్శన్‌‌‌‌ పక్కటెముక ఫ్రాక్చర్‌‌‌‌ అయ్యింది. దాంతో టోర్నీ మిగతా మ్యాచ్‌‌‌‌ల్లో అతను ఆడే అవకాశాల్లేవు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఐపీఎల్‌‌‌‌ లో  గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ‘సుదర్శన్‌‌‌‌ డైవింగ్‌‌‌‌ చేస్తూ కిందపడటంతో కుడి వైపు ఓ పక్కటెముక విరిగింది. 

డిసెంబర్‌‌‌‌ 29న బీసీసీఐ సెంటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌లో నిర్వహించిన స్కానింగ్‌‌‌‌లో ఈ విషయం బయటపడింది. అంతకుముందు ఓసారి నెట్‌‌‌‌ సెషన్‌‌‌‌లోనూ ఇదే ప్రాంతంలో దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన పక్కటెముకకు తగిన రక్షణను ధరించి లోయర్‌‌‌‌ బాడీకి సంబంధించిన కండిషనింగ్‌‌‌‌ను చేస్తున్నాడు. 

రాబోయే 7 నుంచి 10 రోజుల్లో అప్పర్‌‌‌‌ బాడీ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌‌‌ కూడా మొదలుపెడతాడు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. పక్కటెముకల గాయం నయం కావడానికి సాధారణంగా ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుంది