
హైదరాబాద్ : హైటెక్ సిటీ ఐటీ కారిడార్‌లో పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన దుర్గం చెరువులో సందడి నెలకొంది. హుస్సేన్ సాగర్ లో కొనసాగే సెయిలింగ్ పోటీలు ఇప్పుడు దుర్గం చెరువులోనూ ప్రారంభమయ్యాయి. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ.. యాట్ (వైఎసీటీహెచ్) క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తో కలిసి దుర్గం చెరువులో సెయిలింగ్ క్రీడలను ప్రారంభించాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై.. వాటర్ స్పోర్ట్స్ (సెయిలింగ్)ను ప్రారంభించారు. పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన దుర్గం చెరువులో వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభించడంతో మరింత మందిని ఆకర్షిస్తుందని అర్వింద్ కుమార్ అన్నారు. దీంతో పాటుగా వాటర్ స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతున్న యువతకు అవకాశంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.