
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మహి వి రాఘవ్(Mahi v raghav) తెరకెక్కించిన లేటెస్ట్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సైతాన్(Shaitan)’. వణుకు పుట్టించే క్రైమ్ సీన్స్, వయలెన్స్, బోల్డ్ డైలాగ్స్ తో దర్శకుడు మహి వి రాఘవ్ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. తెలుగులో ఈ రేంజ్ బోల్డ్ కంటెంట్‌తో వెబ్ సిరీస్ రావటం ఇదే మొదటిసారి. దీంతో ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డిస్నీ హాట్‌స్టార్‌లో(Disny hotstar) స్ట్రీమింగ్ అవుతున్న సైతాన్ సిరీస్‌కి రికార్డ్ వ్యూస్ ను దక్కించుకుంది. రీసెంట్ గ రిలీజైన ఏ సిరీస్ కు ఈ రేంజ్ రేపాన్స్ రాలేదు. దీంతో..సైతాన్ సిరీస్ సాధించిన విజయంపై డైరెక్టర్ మహి వి రాఘవ్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. సైతాన్ సీరీస్ అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయాన్ని మేము ఊహించలేదు. ప్రతి ఆర్టిస్ట్ , టెక్నీషియన్ ఈ సీరీస్ కోసం కష్టపడి పనిచేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్, డైలాగ్స్, ఆర్ట్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కు మంచి ప్రశంశలు వస్తున్నాయి. త్వరలో సైతాన్ కు కొనసాగింపుగా ‘సైతాన్ 2(Shaitan2)’ ఉంటుందని అని తెలిపారు. ఇక మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ "సిద్దా లోకం ఎలా ఉంది నాయనా" సినిమా త్వరలో విడుదల కానుంది.