
రోడ్డుపై ఎవరికైనా ప్రమాదం జరిగితే మనకెందుకులే అని అనుకుంటారు చాలామంది. చూసి చూడనట్టుగా వెళ్తారు తప్ప వారిని కాపాడే ప్రయత్నం చేయరు. ఎవరో నూటికొకరు మానవత్వం ఉన్న వాళ్లు ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షిస్తారు. ఆ నూటిలో ఒకరి లాంటోడే యువ హీరో సాయిధరమ్ తేజ్. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తన కారులో ఆస్పత్రికి తరలించి తన మానవత్వం చాటుకున్నాడు తేజ్.
సాయి ధరమ్ తేజ్ నానక్ రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 42 టర్నింగ్ వద్ద టూ వీలర్ వెహికిల్ అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న సాయిధరమ్ తేజ్ తన కారును ఆపాడు. గాయాలైన వ్యక్తి తన స్నేహితుడు,మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అని వెంటనే గుర్తుపట్టి తన కారులో తీసుకుని దగ్గర్లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు.