చంద్రబాబును సీఎం చేయడానికే షర్మిల వచ్చారు: సజ్జల

చంద్రబాబును సీఎం చేయడానికే షర్మిల వచ్చారు: సజ్జల

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిల కాంగ్రెస్  పార్టీలో చేరిన తరువాత భాష, యాస మారిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసని ప్రశ్నించారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు.వైఎస్ఆర్ పేరును కూడా చార్జిషీట్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. సోనియా గాంధీ చెబితేనే కేసు వేశానని శంకర్ రావు చెప్పారు.. ఆజాద్ కూడా జగన్ మాట విని ఉంటే ఇలా జరిగేది కాదు అన్నారని సజ్జల తెలిపారు.

ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చూసాకా బాధ పడ్డాం.. జాలి పడుతున్నామని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిందని ఆరోపించారు. ఏపీకి అన్యాయం చేసింది కాంగ్రెస్ తో పాటు టీడీపీనేనని పేర్కొన్నారు.  2019 ఏపీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయని సజ్జల విమర్శించారు. చంద్రబాబును ఏపీ సీఎం చేయడానికి షర్మిల వచ్చారన్నారు. చంద్రబాబు అన్ని అస్త్రాలతో పాటు వైఎస్ఆర్ ఓట్లు చీల్చడానికి షర్మిలను ఏపీకి తీసుకువచ్చారని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఉనికి లేదని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు డైలాగ్ లను వైఎస్ షర్మిల ఇవాళ మాట్లాడారన్నారు. షర్మిల ఇస్తున్న పిలుపు గందర గోళంకు దారి తీసేలా ఉన్నాయని తెలిపారు. జగన్ ను నియంత అని షర్మిల అన్నారని గుర్తు చేశారు. షర్మిల ఇప్పటి వరకు తెలంగాణలో ఏమి చేశారు.. ఇప్పుడు హఠాత్తుగా ఏపీకి వచ్చారు.. ఎవరి ప్రయోజనాల కోసం వచ్చారు ? అని ప్రశ్నించారు.