అలాంటి యాడ్స్ లో నటించొద్దు.. అమితాబ్ కి సజ్జనార్ రిక్వెస్ట్

అలాంటి యాడ్స్ లో నటించొద్దు.. అమితాబ్ కి సజ్జనార్ రిక్వెస్ట్

యాడ్స్..  ప్రజెంట్ మార్కెట్లో చాలా కీలకం. కంపెనీలు తమ ప్రాడక్ట్స్ ను అమ్ముకోవడం కోసం ఎన్నో ఎత్తులు పై ఎ్తతులు వేస్తాయి.  కోట్లు పెట్టి సెలబ్రిటీలతో యాడ్స్ తీసి సొమ్ము చేసుకుంటాయి ఈ  కంపెనీలు.  సెలబ్రిటీలు కూడా ఆ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులు, ప్రొడక్ట్స్ మంచివా, హానికరమైనవా  చూడకుండా ప్రకటనల్లో నటిస్తారు. తర్వాత చిక్కుల్లో ఇరుక్కుంటారు.  

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా అమెరికాకు చెందిన ఆమ్వే కంపెనీకి  బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ఇలాంటి యాడ్స్ చేయొద్దని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్   అమితాబ్ కి సూచించారు. ఆమ్వే లాంటి మోసపూరిత కంపెనీలకు సహకరించొద్దని ట్విట్టర్లో  అభ్యర్థించారు.  దేశ సామాజిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న ఇలాంటి గొలుసు కట్టు సంస్థలను ప్రమోట్ చేయొద్దని సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు సజ్జనార్. 

https://twitter.com/SajjanarVC/status/1641621126798512130

ఆమ్వే  కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ కు పాల్పడుతోందని ఈడీ  2022 లో ఆరోపించింది.  ఆమ్వే ఆస్తులను సీజ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.