ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్ లో హైదరాబాద్ జట్టుకు తిరుగు లేదు. టాపార్డర్, మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టర్లతో నిండిపోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో పాటు క్లాసన్, లివింగ్ స్టోన్, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి జట్టులో ఉన్నారు. వీరందరూ అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్ హిట్టర్లుగా పేరొందినవారే. అయితే సన్ రైజర్స్ అసలు సమస్య అంతా బౌలింగే. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మినహాయిస్తే మిగిలివారికి అనుభవం లేదు. హర్షల్ పేటల్, ఉనాడ్కట్ గతంలో రాణించినా ప్రస్తుతం ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు.
బౌలింగ్ గురించి ఆందోళన చెందుతున్న సమయంలో సన్ రైజర్స్ కు బీహార్ ఫాస్ట్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ ఆశాకిరణంగా కనిపించాడు. ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సాకిబ్ హుస్సేన్ ను రూ.30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. పెద్దగా అంచనాలు లేకుండా జట్టులోకి వచ్చిన సాకిబ్ సంచలనంగా మారేలా కనిపిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున బరిలోకి దిగనున్న సాకిబ్ నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా స్వింగ్, బౌన్సర్లతో విరుచుకుపడుతున్నాడు. నెట్స్ లో వెటరన్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ సైతం సాకిబ్ హసన్ బౌలింగ్ ఆడలేకపోతున్నాడు.
►ALSO READ | Vijay Hazare Trophy 2025-26: కంబ్యాక్ లో అదరగొట్టిన అయ్యర్, సిరాజ్.. గిల్, జైశ్వాల్, రాహుల్ ఫ్లాప్
బంతి అనూహ్యంగా స్వింగ్ అవ్వడంతో పాటు బౌన్స్ కూడా అవుతుంది. తన బౌలింగ్ తో దినేష్ కార్తీక్ ను బెంబేలెత్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాకిబ్ సూపర్ బౌలింగ్ చూసి సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మెరుపు బౌలింగ్ చూసి ఖుషీ అవుతున్న కావ్యా మారన్ అండ్ టీమ్, ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ బలహీనతలకు సాకిబ్ చెక్ పెడతాడని ఆశిస్తున్నారు. ఐపీఎల్ లో గతంలో సాకిబ్ కోల్ కతా నైట్ రైడర్స్ మత్తులో ఉన్నాడు. 21ఏళ్ళ ఈ పేసర్ కు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. మరి సన్ రైజర్స్ అవకాశం ఇస్తుందా ఇస్తే ఎలా ఆడతాడో ఆసక్తికరంగా మారింది.
🚨 गोपालगंज के लाल का खौफनाक बाउंसर! 🔥
— सीतामढ़ी जिला 🇮🇳 (@SitamarhiJila) January 5, 2026
बिहार के गोपालगंज से निकले Sakib Hussain अब Sunrisers Hyderabad के लिए खेलते नज़र आएंगे।
उनकी रफ्तार का अंदाज़ा इसी से लगाइए—एक बाउंसर सीधे Dinesh Karthik के हेलमेट पर जा लगी! 😲💥 pic.twitter.com/7W0hv6rJpI
