ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఆడం: సాక్షి మాలిక్‌‌‌‌‌‌‌‌

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఆడం: సాక్షి మాలిక్‌‌‌‌‌‌‌‌

సోనేపట్‌‌‌‌‌‌‌‌: లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ చీఫ్‌‌‌‌‌‌‌‌ బ్రిజ్‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళనను ఉదృతం చేశారు. ఈ నెల 15లోగా బ్రిజ్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయకపోతే ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగబోమని సాక్షి మాలిక్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించింది. శనివారం సోనేపట్‌‌‌‌‌‌‌‌లో ఖాప్‌‌‌‌‌‌‌‌ పంచాయితీ పెద్దలు, రైతులతో సమావేశమైన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మా సమస్యలన్నీ పరిష్కారమైతేనే ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఆడతాం. మేం మానసికంగా చాలా అలసిపోయాం. 

సెక్షన్‌‌‌‌‌‌‌‌ 161, 164 కింద స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ రికార్డు చేశారు. దానిని ఎందుకు మార్చారో కూడా తెలియదు. మైనర్‌‌‌‌‌‌‌‌ తండ్రి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. ఎంతకాలం ఈ ఒత్తిడిని భరిస్తారు. లంచం తీసుకుని నిరసనను ముగించాలని బజ్‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌కు కాల్స్‌‌‌‌‌‌‌‌ వస్తున్నాయి. తప్పుడు కథనాల ద్వారా బ్రిజ్‌‌‌‌‌‌‌‌ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ముందుగా అతన్ని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలి’ అని సాక్షి పేర్కొంది.