
అఖిల్‌కి జంటగా ‘ఏజెంట్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాక్షి వైద్య. గ్లామర్‌తో ఆకట్టుకున్నా.. సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో సాక్షి నెక్స్ట్ మూవీతోనైనా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకుంటోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ‘గాండీవధారి అర్జున’లో నటిస్తోంది సాక్షి.
ఈ సినిమా కోసం సాక్షినే సొంతంగా డబ్బింగ్ చెబుతుంది. ‘లెట్స్‌గో గాండీవ ధారి అర్జున’ అంటూ తను డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆడియెన్స్‌కు దగ్గరవడం కోసం ఆమె స్వయంగా డబ్బింగ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ బుడాపెస్ట్‌లో సోమవారం నుంచి మొదలుపెడుతున్నట్టు టీమ్ తెలియజేసింది.
ఇందులో వరుణ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని షూట్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.