
న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్ స్టాఫ్‌కు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాలు దీపావళి కంటే ముందే ఇస్తామని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) చైర్మన్ పి.కె. పుర్వార్ చెప్పారు. జీతాలు చెల్లించాలనే డిమాండ్‌తో నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1.76 లక్షల మంది ఎంప్లాయిస్‌కు ప్రతి నెల బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 850 కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉంది. సంస్థ రెవెన్యూ రూ.1600 కోట్లు అయినప్పటికీ దానిలో ఎక్కువ శాతం ఆపరేషనల్ ఖర్చులు, స్టాట్యుటరీ పేమెంట్స్ కోసం ఉపయోగిస్తున్నారని అధికారులు చెప్పారు. దాని కోసం గవర్నమెంట్ గ్యారెంటీలతో బ్యాంక్‌ల నుంచి ఫండ్స్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.