
- ఐపీఓ ద్వారా అమ్ముతామని పీఎన్‌బీ కెనరా ప్రకటన
న్యూఢిల్లీ: కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 10 శాతం వాటాలను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయడం ద్వారా విక్రయించనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం, పీఎన్బీకి బీమా సంస్థలో 23 శాతం వాటా ఉంది. పీఎన్‌బీ బోర్డు మంగళవారం జరిగిన సమావేశంలో 10 శాతం వాటాను తగ్గించే ప్రక్రియను ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి ఉంటుందని పీఎన్‌బీ పేర్కొంది. బీఎస్‌ఈలో పీఎన్‌బీ షేర్లు 15.80 శాతం పడిపోయి రూ.115.35 వద్ద ముగిశాయి.