
హైదరాబాద్, వెలుగు: పియర్సన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేల్స్‌ఫోర్స్ సర్టిఫికేషన్ పరీక్షలకు ప్రత్యేక ప్రొవైడర్‌గా నిలిచింది. ఈ భాగస్వామ్యం ద్వారా, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తామని తెలిపింది. ఉద్యోగుల, సంస్థల నైపుణ్యాలను పెంచడానికి పియర్సన్, సేల్స్‌ఫోర్స్ కలిసి పని చేస్తున్నాయి. ఇందుకోసం కొత్త సర్టిఫికేషన్ విధానాన్ని అమలు చేస్తాయి.
పియర్సన్2025 రిపోర్ట్ ప్రకారం, సర్టిఫికేషన్ పొందిన నిపుణులలో 70 శాతం మంది తమ సామర్థ్యం పెరిగిందని చెప్పారు. 63 శాతం మంది పదోన్నతి పొందామని లేదా పొందబోతున్నామని చెప్పారు. పియర్సన్ వీయూ 80 సేల్స్‌ఫోర్స్ సర్టిఫికేషన్ పరీక్షలను ఆన్లైన్, ఇన్-పర్సన్, ఈవెంట్-బేస్డ్ ఫార్మాట్లలో అందిస్తుంది. ఈ పరీక్షలలో సేల్స్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్, ఏజెంట్‌ఫోర్స్ స్పెషలిస్ట్ వంటివి ఉన్నాయి.