‘కిసీ కా భాయ్​ కిసీ కీ జాన్​’లో ఆకట్టుకునే హెయిర్​ స్టైల్, ప్రింటెండ్​ జాకెట్​ తో సల్మాన్​

‘కిసీ కా భాయ్​ కిసీ కీ జాన్​’లో ఆకట్టుకునే హెయిర్​ స్టైల్, ప్రింటెండ్​ జాకెట్​ తో సల్మాన్​

రాబోయే తన సినిమా ‘కిసీ కా భాయ్​ కిసీ కీ జాన్​’కు సంబంధించి బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ ఖాన్​ ఆసక్తికర అప్​ డేట్​ ను విడుదల చేశారు. షూటింగ్​ సెట్స్​ నుంచి ఒక చక్కటి ఫొటోను ఆయన ఇన్​ స్టాగ్రామ్​ లో పోస్ట్​ చేశారు. ఈ ఫొటోలో సల్మాన్​ ఖాన్​ పొడవాటి జుట్టుతో ఒక ప్రింటెండ్​ జాకెట్ ధరించి మెరిసిపోతూ కనిపిస్తారు.  “మూవీ షూటింగ్​ పూర్తయింది. కిసీ కా భాయ్​ కిసీ కీ జాన్​ సినిమా 2023 ఈద్​ సమయానికి విడుదలవుతుంది”అని ఈ ఫొటోకు సల్మాన్​ ఖాన్​ క్యాప్షన్​ పెట్టారు.

ఈ సినిమాకు ఫర్హాద్​ సామ్జి డైరెక్టర్​ గా వ్యవహరిస్తుండగా.. సల్మాన్​ ఖాన్​ ఫిల్మ్స్​ సంస్థ దీన్ని ప్రొడ్యూస్​  చేస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, వెంకటేశ్​ దగ్గుబాటి, షెహనాజ్​ గిల్​, పాలక్​ తివారీ, విజేందర్​ సింగ్​ వంటి ప్రముఖ నటులు కూడా యాక్ట్​ చేస్తున్నారు. సల్మాన్​ ఖాన్​ తదుపరి మూవీ ప్రాజెక్టుల జాబితాలో కిక్​2, టైగర్​ 2 ఉన్నాయి. ప్రస్తుతానికి బిగ్​ బాస్​ 16 షోతో సల్మాన్​ బిజీగా ఉన్నారు.