
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మంగళవారం (Sep9) తన కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారత్–చైనా సరిహద్దుల్లో 2020లో జరిగిన గల్వాన్ లోయ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించినట్టు సల్మాన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తెలంగాణకు చెందిన వీర సైనికుడు, గల్వాన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై హిందీతోపాటు తెలుగునాట అంచనాలు ఏర్పడ్డాయి.
ALSO READ : రిలీజ్ ముందే మిరాయ్కి క్రేజీ టాక్..
ప్రస్తుతం లడఖ్ ప్రాంతంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం భారత సైనికులకు నివాళిగా రూపొందిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు.
#BattleOfGalwan pic.twitter.com/sj4iy4SXaz
— Salman Khan (@BeingSalmanKhan) September 9, 2025
2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య పోరాటం ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. ఈ పోరులో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 16వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన సూర్యాపేటకు చెందిన కల్నల్ బి. సంతోష్ బాబు తీవ్రంగా గాయపడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత దళాలను నడిపించారు.
ఆయన మరణానంతరం ప్రభుత్వం మహావీర్ చక్రను ప్రదానం చేసింది. ఇప్పుడు సంతోష్ బాబు పాత్రను సల్మాన్ పోషిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నాడు.