చిరు మూవీలో సల్మాన్ నటిస్తున్నాడా?

చిరు మూవీలో సల్మాన్ నటిస్తున్నాడా?

న్యూఢిల్లీ: టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటైన ఆచార్య సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించనున్నాడనే రూమర్ బాగా ప్రచారం అవుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో అతిథి పాత్రలో సల్మాన్ మెరుస్తారని పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ మూవీ కోసం తాము సల్మాన్ ను ఇంతవరకు కలవలేదని నేషనల్ మీడియాకు ఆచార్య ఫిల్మ్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారని సమాచారం. ‘ఈ రూమర్లు ఎవరు సృష్టించారో తెలీదు. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. ఈ రోల్ కోసం సల్మాన్ ను మేం సంప్రదించలేదు. మూవీలో ఎవరెవరు నటిస్తున్నారనే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తాం’ అని మూవీ మేకర్స్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమాలో కీలకమైన గెస్ట్ రోల్ లో రామ్ చరణ్ నటిస్తాడని కొన్నాళ్ల క్రితం పుకార్లు షికార్లు చేశాయి. అయితే రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో చరణ్ బిజీగా ఉండటంతో ఈ పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తారని కథనాలు ఊపందుకున్నాయి. దీనిపై సినిమా యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.
హీరోయిన్ ఎవరు?
ఆచార్య మూవీలో చిరు డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారని కూడా రూమర్లు వస్తున్నాయి. ఈ సినిమాలో నక్సలైట్ నుంచి సామాజిక సంస్కర్తగా మారిన పాత్రలో చిరు కనిపించనున్నాడు. ఆలయ విరాళాలు, ఫండ్స్ పై దేవాదాయ శాఖను నిలదీసేలా చిరు క్యారెక్టర్ ఉండనుంది. తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఫిల్మ్ లో హీరోయిన్ పాత్రపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. మొదట త్రిషను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆమె మూవీ నుంచి తప్పుకొంది. ఆ తర్వాత ఖైదీ నం.150 లో చిరు పక్కన చిందులేసిన కాజల్ ను నాయికగా తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఓ తమిళ సినిమా కోసం కాజల్ కూడా ఆచార్య నుంచి తప్పుకొందని తెలుస్తోంది. దీని గురించి మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.