
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర ఇటీవల జరిగిన కాల్పులు కలలకం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముంబై పోలీసులు దాఖలు చేసిన 1,735 పేజీల ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా చంపడానికి ప్రయత్నించాడని పేర్కొన్నాడు సల్మాన్ ఖాన్. జూలై 2024లో ముంబై పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం, బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో బిష్ణోయ్ కాల్పులు జరిపింది నిజమని నమ్ముతున్నానని అన్నారు సల్మాన్.
బిష్ణోయ్, అతని గ్యాంగ్ సభ్యుల నుండి తమ కుటుంబానికి వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి వివరాలను కూడా సల్మాన్ చార్జిషీట్లో పంచుకున్నారు. జనవరిలో తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వ్యక్తులు చొరబడేందుకు ప్రయత్నించారని, వీరిని బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులుగా ముంబై పోలీసులు గుర్తించినట్లు సల్మాన్ ఖాన్ వెల్లడించారు.తెల్లవారుజామున 4:55 గంటలకు తనకు క్రాకర్స్ లాంటి శబ్దం వినిపించిందని, కాల్పులు జరిగినప్పుడు తాను నిద్రలో ఉన్నానని చార్జిషీట్లో పేర్కొన్నాడు సల్మాన్.
Also Read:-అపుడు మెసేజ్ ఇవ్వాలనుకున్నా..విజయ్ దేవరకొండతో వివాదంపై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గెలాక్సీ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తు బాల్కనీలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గన్ తో కాల్పులు జరిపారని, దీనికి ముందు తన కుటుంబంపై దాడికి కూడా లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహించాడని తెలిసిందని, కాబట్టి తన బాల్కనీలో కాల్పులు జరిపింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని నమ్ముతున్నానని పేర్కొన్నారు సల్మాన్ ఖాన్.